మన జీవితంలో తమలపాకుకు ఉన్న ప్రాధాన్యం మనకు తెలియంది కాదు. భోజనం తరువాత నమిలే తాంబులమే ఇందుకు నిదర్శనం. పెద్దలు నిత్యజీవితంలో ప్రవేశపెట్టిన ప్రతిదానికి ఒక అర్థం పరమార్థం ఉంది. తమలపాకులో అన్ని సుగుణాలున్నాయి. తాంబులం వేసుకునే వారికి చాలామందికి ఈ విషయమే తెలియదు. ఆరోగ్యాన్ని అంతగా ప్రభావితం చేసే అంశాలేమిటో చూద్దాం.
తమలపాకును మెత్తబడే వరకు వేడి చేసి, దానిపై కాస్టర్ ఆయిల్‌ను పూసి కాలిన గాయాలపై ఉంచితే గాయాలు త్వరగా మానిపోతాయి. గంటగంటకు ఇలా చేయగలిగితే మంచి ఫలితం ఉంటుంది. కీళ్ళవాపు, మంటలతో బాధపడేవారు ఆ ప్రాంతంలో తమలపాకును కాసేపు ఉంచితే, వాపు తగ్గుతుంది. సాధారణంగా వెన్నునొప్పితో బాధపడే వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. తమలపాకు నుంచి తీసిన రసాన్ని శుద్ధి చేసిన కొబ్బరి నూనెలో కలిపి వీపుపై రాసుకుంటే వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. తమలపాకులను ఆవనూనెలో నానబెట్టి కొద్దిగా వేడి చేసి పిల్లల ఛాతీపై రుద్దితే ఆయాసం, దగ్గులాంటివి తగ్గుతాయి.
చెవి పోటు అధికంగా ఉన్నవారికి కొన్ని చుక్కల రసాన్ని పిండితే వెంటనే తగ్గిపోతుంది. భుక్తాయాసం అధికంగా ఉన్నవారు తమలపాకులు నమిలితే ఉపశమనం లభిస్తుంది. తమలపాకు రసాన్ని గాయాలపై పూస్తే తొందరగా తగ్గిపోతుంది. గొంతులో నస, మంట, ఇన్‌ఫెక్షన్‌ల నుంచి ఉపశనం పొందాలనుకుంటే తమలపాకుల నుంచి తీసిన రసాన్ని గొంతు కింద పూస్తే ఇట్టే ఉపశమనం లభిస్తుంది.
|