ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > చిట్కాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆరోగ్యానికి నాలుగు మంచి మాటలు  Search similar articles
Yarram Reddy
Sr.Sub-editor
ఉన్న చోటు నుంచి కదలకుండా, ఇలా ఉన్న పుల్ల అలా వేయకుండానే ఆరోగ్యం బాగుండాలని కోరుకునే వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇది సహజంగా పురుషాధిక్యత ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కనీస పనులు చేయకుండానే సంపూర్ణ ఆరోగ్యం వారు కోరుకోవడంలో న్యాయం ఉందా...! లేదనుకుంటే కింది సలహాలను పాటించండి.

ఓస్ ఇంతేనా ఇదంతా మాకు తెలియదా ఏంది అనుకునేవారూ ఉన్నారు. జబ్బు ముదిరి డాక్టర్ దగ్గరకు వెళ్ళినా ఇవే మాటలు డాక్టరు చెపితే తూ.చ. తప్పకుండా పాటిస్తారు. అంతకంటే ముందుగా అవేవో తెలుసుకుంటే పోలా

సాధారణంగా ఏమేవ్.... కాస్తనీళ్ళు ఇవ్వు అనడం కంటే వెళ్ళి తెచ్చుకోవడం మంచిది. కార్యాలయం నుంచి ఇంటికి వచ్చేటపుడో లేదా వెళ్ళేటప్పుడో లిఫ్టు ఎక్కడం మాని మెట్లెక్కి, దిగితే కొంతలో కొంతైనా శారీరక వ్యాయామం లభిస్తుంది. మొబైల్‌లో మాట్లాడేటపుడు ఒక్కే చోటనిలబడుకోవడం కంటే కాస్త అటూ ఇటూ తిరగడం మంచిది. దీనివలన కూడా కాస్త శరీరం వదులవుతుంది.

ఇంట్లో టివి చూస్తున్నపుడు రిమోట్ వాడడం కంటే నేరుగా టివి వద్దకు వెళ్ళి ఛానళ్ళు మార్చుకుంటే.... కాస్త ఆలోచించండి. తేడాగా అనుకోవద్దు. ఇకపోతే తేలికపాటి వ్యాయామాలు కొన్ని చేస్తే మన శరీర ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.
మరిన్ని
గొంతునొప్పికి చేమంతి వైద్యం
మనసుంటే గోరంత సోకు
తమలపాకుతో రోగాలకు స్వస్తి, ఉపశమనం
గ్రీన్ టీ సిప్ చేయండి
మనిషిని వేధించే ఒత్తిడి: దూరం కావాలంటే ఇలా చేయండి
ప్రత్యేక వేసవి స్నానంతో చమటకాయలు మాయం