ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > చిట్కాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
దోమలదాడి నుంచి బయట పడాలంటే...  Search similar articles
వర్షకాలం వచ్చిదంటే దోమలు జనావాసాలపై దాడులు చేస్తాయి. ఇది షరా మామూలే. కొన్నిరకాల దోమలు కుడితే విషజ్వరాలు తప్పవ్.... దోమలు ఎన్నోరకాల వ్యాధులకు కారణమవుతున్నాయి. ఆ దోమల నుంచి తప్పించుకోవడానికి కొన్ని సూచనలు..

ఇంటికి దగ్గరలో మురుగు గుంతలున్నాయా... అయితే దోమగుడ్లను తినేసేందుకు వాటిలో గంబుసియా చేపలను వేయండి. నీళ్ళ ట్యాంకులపై దోమల నివారణ మూతలను వాడాలి. కూలర్లు, మొక్కల కుండీలు వాడుతున్నారా అయితే వాటిని వారానికి ఒక్కమారైనా శుభ్రపరచాలి. అప్పుడు దోమల గుడ్లు చనిపోతాయి.

చాలా రోజుల నుంచి నీళ్ళు నిలువ ఉన్న పాత్రలు ఏమైనా ఉంటే వాటిని వెంటనే ఖాళీ చేసేయడం మంచిది. సాధారణంగా నీడ ఉన్న ప్రాంతాలను దోమలు ఎక్కువగా ఆవాసాలుగా మార్చకుంటాయి. కాబట్టి అలాంటి ప్రాంతాలలో వెలుగు ప్రసారం అయ్యేలా చూడాలి.

ఎంత ఏసిలు, ఫ్యాన్లు ఉన్నా పడక గదితో సహా అన్ని వాకిళ్ళు, కిటికీలకు నెట్లు ఏర్పాటు చేసుకోవడమ ఉత్తమమం. పడుకునే ముందు దోమతెరలు తప్పని సరిగా వాడాలి.
మరిన్ని
ఆరోగ్యానికి నాలుగు మంచి మాటలు
గొంతునొప్పికి చేమంతి వైద్యం
మనసుంటే గోరంత సోకు
తమలపాకుతో రోగాలకు స్వస్తి, ఉపశమనం
గ్రీన్ టీ సిప్ చేయండి
మనిషిని వేధించే ఒత్తిడి: దూరం కావాలంటే ఇలా చేయండి