ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > చిట్కాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అన్నింటికన్నా కాచిన నీరే ఉత్తమం  Search similar articles
తమ కంపెనీ వాటర్ ఫిల్టర్ చెడు బాక్టిరియాను కూడా చంపేస్తుందని కంపెనీలు కటనలుఊదరగొట్టేస్తుంటాయి. కాని వాస్తవానికి వాటి నుంచి ఫలితం ఆశించిన స్థాయిలో ఉండదనే అంశం వాటిని కొని పూర్తిగా చేతులు కాల్చుకునే వరకు అర్థం కాదు. ప్రతీ దానికి మన పెద్దలు కొన్ని పద్దతులు ప్రవేశపెట్టారు. అప్పట్లో అంతటి సాంకేతికత అందుబాటులో లేకపోయినా ఆరోగ్యానికి మాత్రం చాలా జాగ్రత్తలే తీసుకున్నారు.

గాలి, నీరు లేకుండా మానవుడు మనగలగడమనేది అంత సులువు కాదు.వర్షాకాలం వచ్చిందంటే నీటి కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతటి ప్రాధాన్యత ఉన్న తాగు నీటిని ఈ సీజన్‌లో జాగ్రత్తలు తీసుకోకుండా సేవించడంలో అంతే ప్రమాదం దాగి ఉంది. సాధారణంగా రసాయనాలు వేసి శుభ్రపరిచే నీటిలోని సూక్ష్మజీవులు అన్ని పోయాయనుకుంటే పప్పులో కాలేసినట్లే. కొన్ని మాత్రమే చనిపోతాయి.

వాటి స్థానంలో మరికొన్ని సూక్ష్మజీవులు చేరుతాయి. వీటన్నింటిని నమ్ముకోవడం కంటే కాచిన నీరు సేవించడం ఉత్తమని వైద్యులు అంటున్నారు. పెద్దపాత్రను తీసుకుని నీటిని 10 నిమిషాలపాటు బాగా మరిగించాలి. తరువాత ఆ నీటిని చల్లార్చాలి. దాదాపుగా ఇందులోని అన్ని బాక్టీరియాలు నశిస్తాయి. పలుచని వస్త్రం తీసుకుని కాచి చల్లార్చిన నీటిని వడ పోయాలి. అయితే వస్త్రం ఉతికినదై ఉండాలి. ఈ నీటిని సేవించడం వలన దాదాపు అన్ని బాక్టీరియాలకు దూరంగా ఉండవచ్చునని వైద్య నిపుణులు చెపుతున్నారు.
మరిన్ని
దోమలదాడి నుంచి బయట పడాలంటే...
ఆరోగ్యానికి నాలుగు మంచి మాటలు
గొంతునొప్పికి చేమంతి వైద్యం
మనసుంటే గోరంత సోకు
తమలపాకుతో రోగాలకు స్వస్తి, ఉపశమనం
గ్రీన్ టీ సిప్ చేయండి