ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > చిట్కాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
'ఉలవ' వంటి వేడి.. కానీ....ఆరోగ్యానికి  Search similar articles
ఉలవ పేరు చెప్పగానే అందులోని సత్తువ గురించే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉలవ రసం గుర్తుకు రాగానే నోరూరుతుంది. ఇది వేరే మాట. కానీ అది వేడి చేస్తుందిగా... అవునవును... ఉలవ వేడి చేస్తుంది. అయినా సరే దానిలో కూడా ఔషధ గుణాలున్నాయి. ఎన్నో వ్యాధులకు ఉపశమనం కలిగిస్తుంది.

సాధారణంగా ఉలవలో వేడి చేసే గుణం ఉంది. అందుకే కొన్ని వ్యాధులున్నవారు తినకూడదు. మరికొన్ని వ్యాధులను నయం చేయడంలో ఉపయుక్తంగా ఉంటుంది. మూత్రకోశంలో రాళ్ళు ఉన్నవారు ఉలవలను ఆరాంగా తీసుకోవచ్చు. వీటిలో రాళ్ళను కరిగించే గుణం ఉంది. సాధారణంగా రుతు స్రావం సరిగ్గా కాని మహిళలు చాలా మందే ఉన్నారు.

వారు ఉలవలను ఏదోక రూపంలో తీసుకోవచ్చు. ఇందులో రుతు స్రావాన్ని సక్రంగా కలిగించే లక్షణాలున్నాయి. అధికంగా చెమటలు పడుతున్నవారు ఉలవలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే అధికంగా బయటకు వచ్చే నీటి అరికడుతుంది. ఉలవలు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. అజీర్తి ఉన్నవారు వీటిని తీసుకోవడం ఉత్తమం. ఇలా ఉలవలతో ఎన్నో ఉపయోగాలున్నాయి.
మరిన్ని
అవాలు అన్నింటికి మంచిదే
కురులు మెరవాలంటే....
అన్నింటికన్నా కాచిన నీరే ఉత్తమం
దోమలదాడి నుంచి బయట పడాలంటే...
ఆరోగ్యానికి నాలుగు మంచి మాటలు
గొంతునొప్పికి చేమంతి వైద్యం