ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > చిట్కాలు > మెంతుల్లో ఎంతో మేలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మెంతుల్లో ఎంతో మేలు
మెంతులు కాస్తంత చేదు కనిపిస్తాయి. అయితే వీటిలో చాలా ఔషధ గుణాలున్నాయి. ఇందులో ఉపయోగం ఉంటుంది. మెంతికూర, మెంతులు కడుపు ఉబ్బరాన్ని, కడుపులో మంటను తగ్గిస్తాయి. అజీర్తికి విరుగుడుగా పనిచేస్తాయి. మెంతిలో విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. కామెర్లు, రక్తక్షీణత, జలోధరం వంటి వాటికి మెంతులు విరుగుడుగా ఉంటాయి.

లోబీపీ ఉన్నవారికి మెంతులు బాగా ఉపయోగ పడుతాయి. రక్తప్రసారాన్ని పెంచుతాయి. వెంట్రుకలు రాలకుండా ఉండడానికి ఉపయుక్తంగా ఉంటుంది. మెంతుల్ని నానబెట్టి రుబ్బి పేస్టులా తయారు చేసి తలకు పట్టిస్తే వెంట్రులు రాకుండా ఉంటాయి. శరీర చల్లబడే అవకాశం ఉంది. వెంట్రుకలు కూడా నల్లబడుతాయి. చుండ్రు తగ్గిపోతుంది.

వేడిగడ్డలు, చీముగడ్డలు లేస్తే నొప్పి భరించడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితులలో మెంతులు నూరి గడ్డలకు కడితే ఉపయోగం చాలా ఉంటుంది. గడ్డ పరిపక్వానికి వస్తుంది. పగిలిపోవడానికి దోహదపడుతుంది. అప్పుడు చాలా ఉపశమనం కలుగుతుంది. ఫలితంగా నొప్పి పోటు తగ్గుతుంది. మెంతిగింజల కషాయం జ్వరానికి బాగా పనిచేస్తుంది.
మరిన్ని
గుండె పదిలంగా ఉండాలంటే..
దుస్తుల మురికి పూర్తిగా పోవాలంటే....
వర్షంలో తడిస్తే జుత్తు రాలుతుందా...!
'ఉలవ' వంటి వేడి.. కానీ....ఆరోగ్యానికి
అవాలు అన్నింటికి మంచిదే
కురులు మెరవాలంటే....