ఈ కాస్మోటిక్ షాపులు, ఉత్పత్తులు రాకమునుపు కూడా అందం, అందంగానే ఉండేది. కాస్మోటిక్స్ రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో అందంగా కనిపిస్తారంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఇవేవి అందుబాటులో లేని రోజుల్లో మానవులు తమ అందానికి మెరుగులు దిద్దుకునేందుకు పూర్తిగా మొక్కలు, వాటి ఉత్పత్తులపై ఆధార పడేవారు. పెరడులో వాటిని పెంచుకునే వారు.
స్ట్రాబెర్రీతో సున్నిత చర్మం దంచేసిన స్ట్రాబెర్రీను ఒక కప్పులో సగం వరకూ తీసుకోవాలి. అంతే పరిమాణంలో పెరుగు అందులో కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా గిలకరించి చర్మానికి పట్టించాలి. కొద్ది నిమిషాలు స్ట్రాబెర్రీలోని సాలిసిలిక్ ఆమ్లం చర్మంపై ప్రభావాన్ని చూపుతుంది. చర్మాన్ని నునుపుగా తయారు చేస్తుంది. అలాగే బిగుతుగా తయారు చేస్తాయి.
మజ్జిగలోని మైల్డ్ ఆమ్లాలు చర్మాన్ని మృదువుగా తయారు చేస్తుంది. స్ట్రాబెర్రీ చర్మానికి పట్టకపోతే దాని స్థానంలో మామిడిగానీ, బొప్పాయిని వాడవచ్చు. ఇలా చర్మాన్ని మృదువుగా తయారు చేసుకోవచ్చు.
|