ఆకు కూరలు ఫ్రీజర్ల పెట్టి ఒక్కరాత్రయినా గడివకనే అవి వాడిపోతున్నాయి. ఇది ప్రతి ఇంటిలోని ప్రధాన సమస్య. కొందరైతే వస్త్రంలో చుట్టి పెడుతుంటారు. మరికొందరు ప్లాస్టిక్ కవర్లో పెట్టి లోపల పెడుతుంటారు. అయినాసరే ఆకుకూరలు వాడిపోతుంటాయి.
ఇందుకు చక్కటి పరిష్కారం ఉంది. ఆకు కూరలు తీసుకోగానే రెండు నిమిషాలు మరుగుతున్న నీటిలో ఉంచాలి. తరువాత నీటి విదిలించి వేసి నేరుగా ఫ్రీజ్‌లో పెట్టి చూడండి. వారం రోజులైన తాజాగా ఉంటాయి. పెరుగు పులిసి పోతుంటుంది. వెంటనే దానిని సింక్‌లో పడేస్తుంటాం. లీటరు పాల ధర రూ. 25గా ఉన్న ఈ రోజుల్లో ఇలా పడేయడం నిజంగా నష్టదాయకమే.
ఈ సమస్యకు కూడా మంచి మార్గమే ఉంది. పులిసిన పెరుగును పరిశుభ్రమైన వస్త్రంలో మూటకట్టండి. తరవాత దానిని ఒక గిన్నెలోకి తీసుకుని తగినంతగా పాలను కలపండి. కాసేపు ఆగిన తరువాత కవ్వంతో బాగా చిలకాలి. తరువాత అన్నంలో కలుపుకుని తింటే చిలికి పెరుగు భళే టేస్ట్‌గా ఉంటుంది.
కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరిని వేరు చేయడానికి కొన్ని మార్లు నానా తంటాలు పడాల్సి వస్తుంది. నేలకేసి కొడితే చెక్కముక్కలు చేతలను గాయపరస్తాయి. కత్తితో తీస్తామంటే చింత పిచ్చంతైనా రాదు. ఇలాంటి పరిస్థితులలో మార్గమేమైనా ఉందాంటే ఉందనే చెప్పాలి. కొబ్బరి తీయాలనుకునే ముందు అరగంటపాటు ఫ్రీజ్‌లో పెట్టి బయటకు తీయాలి. వెంటనే కొబ్బరి తీస్తే వెంటనే చెక్క నుంచి వేరవుతుంది.
|