నిరంతరం పనులతో వ్యాయామం చేసే తీరిక ఎక్కడుందని చాలా మంది అంటుంటారు. అయితే ఆ పనులు చేయాలన్నా శక్తి అవసరమేగా... అందుకైనా శక్తి కావాల్సిందేగా.... తినగానే శక్తి వస్తుందనుకుంటే పొరబాటే. తినగానే వచ్చేది శక్తి కాదు... వళ్ళు. బాడీ బాగా పెరిగి కదలడానికి వీలు లేకుండా అయిపోతుంది.
అందుకే శక్తి తెచ్చుకోవడానికి కొన్ని వ్యాయామాలు తప్పవు. అవేంటో చూద్దాం రండీ.. మోచేతుల్ని మడచి వేళ్ళను భుజాలపైకి తీసుకురావాలి. అలాగై ఉంచి భుజాల్ని మూడుసార్లు వెనుకకు తిప్పాలి. కాళ్ళు రెండూ దూరంగా పెట్టి నించోవాలి. కుడి చేతిని తలపైకి నిటారుగా చాచి వీలైనంతగా ఎడమవైపుకు వంగాలి. అలాగా కుడివైపుకు చేయాలి.
ఇలా ఒక్కోపక్క కనీసం 20 సార్లు చేయాలి. దీని వలన వెన్నుపాముకు వ్యాయామం లభిస్తుంది. మాడును వెనుకకు, ముందుకు, పక్కలకు చేతిలో మసాజ్ చేసుకోవాలి. తల కింది భాగందాకా జలదరింపు వచ్చేంత వరకూ చేయాలి. జాగింగ్ చేయడం చాలా మంచిది.
|