కరివేపాకును తీసిపడేసినట్లు నన్ను తీసిపడేస్తున్నారని కొందరు వాపోతుంటారు. అలాగే దానిని పులుసులలోకి వాడిన తర్వాత దానిని తీసిపడేయడం సహజం. కాని ప్రతిరోజు కరివేపాకును తింటుంటే అది మధుమేహవ్యాధిని దరిచేరనీయదని వైద్యులు చెబుతున్నారు.
** ప్రతిరోజూ బాగా ఎదిగిన 10 కరివేపాకులు తింటుంటే మధుమేహ వ్యాధి దరిచేరదని వైద్యులు తెలిపారు.
** విరేచనాలు, మొలలువున్నవారు లేత కరివేపాకులను తేనెలో కలిపి తీసుకుంటే ఇది మంచి మందుగా పనిచేస్తుంది.
** జ్వరంగావున్నప్పుడు లేత కరివేపాకులతో తయారు చేసిన కషాయాన్ని సేవిస్తే త్వరగా జ్వరం తగ్గుముఖం పడుతుందని ఆయుర్వేద వైద్యులు పేర్కొన్నారు.
కరివేపాకులో కూడా క్యాలరీలున్నాయి
100గ్రాముల కరివేపాకులో 99 క్యాలరీల శక్తి ఇమిడివుందంటున్నారు వైద్యులు. 100గ్రాముల కరివేపాకులో 16గ్రాముల పిండి పదార్థాలు, ఆరుగ్రాముల ప్రొటీన్లు, పదిగ్రాముల కొవ్పు పదార్థం, 75 గ్రాముల క్యాల్షియం, 60 మిల్లీగ్రాముల ఫాస్ఫరస్, నాలుగు మిల్లీగ్రాముల ఇనుము, ఇంకా విటమిన్లు ఏ, బీ, సీలున్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు తెలిపారు. కాబట్టి ప్రతిరోజు కరివేపాకు తింటారు కదూ! |