నిత్యం యవ్వనంగా కనపడాలంటే ఆహార నియమాలను పాటించండిలా...!
** నిశ్చిత సమయంలో భోజనం చేయండి.
** పాచిపోయిన ఆహార పదార్థాలనుంచి దూరంగా ఉండండి.
** నీళ్ళు అధికంగా త్రాగండి.
** రాత్రిపూట మీరు పడుకునే సమయానికి మూడు గంటల ముందు భోజనం కానిచ్చాలంటున్నారు వైద్యులు.
** భోజనం చేసిన తర్వాత పది నిమిషాలపాటు వజ్రాసనంలో కూర్చోండి.
** భోజనానికి ముందు, తర్వాత నీళ్ళను త్రాగడం ఆరోగ్యానికి హానికరం.
** వేంచిన, మసాలాయుక్తమైన ఆహార పదార్థాలు, పుల్లటి పదార్థాలనుంచి దూరంగా ఉండండి.
** ఉదయంపూట మీరు తీసుకునే అల్పాహారంలో మొలకెత్తిన గింజలు, సలాడ్ ఉండేలా చర్యలు తీసుకోండి.
** కేకులు, ఐస్‌క్రీమ్, డబ్బాలలో నిల్వ చేయబడిన ఆహారంజోలికి వెళ్ళకూడదంటున్నారు వైద్యులు. దీంతో నిత్యం యవ్వనంగా కనపడవచ్చంటున్నారు ఆరోగ్యనిపుణులు. |