** వారానికి నాలుగు సార్లు షాంపూతో తలస్నానం చేయండి. వారంలో ఒక సారి తలకు నూనెను బాగా దట్టించి మాలిష్ చేసి స్టీమ్ టవల్ చుట్టుకోండి. ఆ తర్వాత తల స్నానం చేయండి. చుండ్రు మటుమాయం. ** ముల్తానీ మట్టిలో ఒక చెంచా కొబ్బరి నూనె, ఒక చెంచా నిమ్మకాయ రసం కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించండి. ఒక గంట ఆగి తల స్నానం చేయండి. ** చుండ్రు ఉన్నప్పుడు వేడి నీటితో తలస్నానం చేయకండి. ఒక వేళ వేడినీటితో స్నానం చేయాల్సివస్తే చివరి సారిగా చల్లటి నీటిని తలపై పోసుకోండి. ** వెంట్రుకలు మృదువుగా పట్టులాగా ఉండాలనుకుంటే హెన్నాలో కోడిగ్రుడ్డు సొనను కలిపి మీ తలకు పట్టించండి. దీంతో చుండ్రు మటుమాయం అంటున్నారు బ్యుటీషియన్లు. |