** జలుబు, జ్వరం, శరీరంలో నొప్పులు ఉన్నప్పుడు టీలో తులసి ఆకులను కలిపి సేవించండి. టీ తయారు చేసేటప్పుడు తులసి ఆకులు నాలుగు వేసి ఉడికించండి. ఇలా చేసి టీ త్రాగితే ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.** ఆస్తమాతో బాధపడుతున్న వారు పదిగ్రాముల తులసి ఆకుల రసంలో ఐదు గ్రాముల తేనెను కలిపి సేవిస్తే ఆస్తమా నయమవుతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ** మలబద్దకంతో బాధపడుతుంటే తులసి మొక్కలను చిన్నచిన్నవిగా చేసుకుని కాసింత ఉప్పుకలుపుకుని అందులో సొంఠికలిపి వేడి చేసిత్రాగితే ఉపశమనం కలుగుతుంది.** జీర్ణశక్తి లోపించినప్పుడు ప్రతి రోజూ మధ్యాహ్న భోజనం తర్వాత నాలుగు తులసి ఆకులను నమిలితే జీర్ణశక్తి పెరుగుతుంది. |