ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > చిట్కాలు > చదువుతూ అలసిపోతున్నారా...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చదువుతూ అలసిపోతున్నారా...!
FILE
** చదువుతూ అలసిపోయివుంటే కాసేపు నిలబడండి. 5-10 నిమిషాలపాటు కాసేపు అటూ-ఇటూ తిరగండి లేదా ఏదైనా మిత్రునితో ఫోన్‌లో కాసేపు మాట్లాడండి. లేదా టీవీ ఆన్ చేసి మంచి సంగీతాన్ని వినండి. దీంతో మానసికమైన ప్రశాంతత చేకూరుతుందంటున్నారు వైద్యులు.

** ఎప్పుడూకూడా, ఎలాంటి పరిస్థితుల్లో విపరీత ధోరణితో ఆలోచించకండి. ఇలా ఆలోచిస్తే శారీరక ఒత్తిడి పెరిగి డిప్రెషన్‌లో కూరుకుపోతారు. విపరీతమైన ధోరణితో ఆలోచించేవారికన్నాకూడా సకారాత్మకంగా ఆలోచించేవారే ఎక్కువ కాలంపాటు జీవిస్తారని పరిశోధకులు చెపుతున్నారు.

విపరీత్మకమైన ధోరణితో ఆలోచించేవారు ఎక్కువగా భోజనం చేస్తారు. దీంతో వారు జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు.

ఎలాంటి పరిస్థితుల్లోనూ విపరీతాత్మకమైన ధోరణిలో ఆలోచించకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రశాంతవదనంతో సకారాత్మకమైన ఆలోచనలే చేయాలి.

మీలో విపరీత ధోరణితోకూడుకున్న ఆలోచనలు కలిగినప్పుడు ప్రకృతిలో లీనమయ్యేందుకు ప్రయత్నించండి. పక్షుల కిలకిలారావాలు వినండి. మనసుకు ప్రశాంతత లభిస్తుందంటున్నారు వైద్యులు.

ఇలాంటి సందర్భంలో టీవీలో ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమం తిలకించండి. లేదా ఏదైనా మంచి పుస్తక పఠనం ప్రారంభించండి. లేదా మరేదైనా పనిలో నిమగ్నమవ్వండి. దీంతో మీలో గూడుకట్టుకున్న విపరీతమైన ధోరణి మటుమాయమవుతుందంటున్నారు వైద్యులు.

విపరీతమైన ధోరణితో ఆలోచించేవారితో స్నేహం చేయకండి. ఎందుకంటే వారు ఏది చేసినా అందులో తప్పు దొర్లితే అది మీ వల్లేననేది వారు తేల్చి చెప్పేస్తారు. కాబట్టి అలాంటి వారితో జాగ్రత్తగా మసలుకోవాలంటున్నారు వైద్యులు.

సానుకూలంగా ఆలోచించేవారు, ఆశావహులు ఎల్లప్పుడు ఆడుతూ...పాడుతూ... ఉంటారు. వారిలో ఎప్పుడుకూడా నిరాశ కనపడదు. ఇలాంటివారు ఎక్కువకాలం జీవిస్తారంటున్నారు వైద్యులు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఆరోగ్యంగా ఉండాలనుకుంటే...!
జలుబుతో బాధపడుతుంటే తులసి తీసుకోండి
చుండ్రును తరిమికొట్టండిలా...!
నిత్య యవ్వనంగా ఉండాలంటే...!
మద్యం ఎక్కువగా సేవిస్తుంటే...ఆపిల్ పండివ్వండి...!
మోకాళ్ళ నొప్పులకు చిట్కాలు...!