ఆరోగ్యానికి ఆయుధం సైకిల్. నిజమేనండి... ఆరోగ్యంగా ఉండేందుకు సైకిల్ నడపండి. మహిళలైతే విసురు రాయిని తిప్పాలి. పురుషులైతే సైకిల్ తొక్కాలంటున్నారు వైద్యులు. ఇలా చేస్తే శరీరానికి మంచి వ్యాయామంకూడా అని అంటున్నారు వైద్యులు. ఇంటినుంచి బజారుకు, కార్యాలయానికి, పిల్లలను స్కూలుకు తీసుకువెళ్ళేందుకు లేదా విద్యుత్ బిల్లును కట్టేందుకు ఎంచక్కా సైకిల్‌పై వెళ్ళండి. దీంతో శరీరానికి అనుకోని వ్యాయామంతో ఫలితం లభిస్తుంది.
** సైకిలింగ్ వల్ల శరీరానికి పూర్తి వ్యాయామం కల్గి రోగాలను తరిమికొడుతుంది. ఆరోగ్యంగానూ ఉంటారంటున్నారు వైద్యులు.
** హృద్రోగంతో బాధపడేవారికికూడా సైకిలింగ్ ఎంతో లాభదాయకం అంటున్నారు వైద్యులు.
** సైకిలింగ్ చేయడం వలన కాళ్ళ పిక్కల్లోని కండరాలకు బలం చేకూరుస్తుంది. శరీరంలోనుంచి చెమట బయటకు రావడంతో వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు.
** అన్నింటికంటే ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో అధిక సమాయం గడిపేలా చర్యలు తీసుకోండి.
|