ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > చిట్కాలు > రక్తపోటున్నవారి ఆహారం ఏంటి?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రక్తపోటున్నవారి ఆహారం ఏంటి?
** అధికరక్తపోటుతో బాధపడుతున్నవారు అధిక మోతాదులో భోజనం తీసుకోవాలి. అలాగే ఘనమైన ఆహార పదార్థాలనుంచి దూరంగా ఉండాలంటున్నారు వైద్యులు.

** మీరు తీసుకునే భోజనంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలుండేలా చూసుకోవాలి.

** ఉల్లిపాయలు, సగ్గుబియ్యం, సోయాబీన్, వెల్లల్లినికూడా మీరు ఆహారంగా తీసుకోవాలంటున్నారు వైద్యులు.

** మీరు తీసుకునే భోజనంలో పొటాషియం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా సోడియం తక్కువగా ఉండాలి. ఉప్పును తక్కువగా ఉపయోగించండి.

** డైరీ ఉత్పత్తులు, చక్కెర, రిఫైన్డ్ ఆయిల్‌తో చేసిన ఆహార పదార్థాలు, వేపుళ్ళు, కెఫిన్, జంక్ ఫుడ్ లాంటివి తీసుకోకూడదంటున్నారు వైద్యులు.

** రోజుకు కనీసం 10 నుంచి 12 గ్లాసుల నీటిని తప్పనిసరిగా సేవించాలి.

** తక్కువ మోతాదులో సజ్జలు, గోధుమలు, జొన్నలు. వీటి పిండితో తయారుచేసిన రొట్టెలు, పెసలపప్పు, సగ్గుబియ్యం, మొలకెత్తిన విత్తనాలను ఆహారంగా తీసుకోవాలంటున్నారు వైద్యులు.

** పాలాకు, గోబీలాంటి ఆకుకూరలను కూడా ఆహారంగా తీసుకోవాలంటున్నారు వైద్యులు.

** కాయగూరలలో సొరకాయ, నిమ్మకాయ, బీరకాయ, పుదీనా, గుమ్మడికాయ, కాకరకాయ, దొండకాయలను తీసుకోవాలి.

** వాము, ఎండు ద్రాక్షపండు మరియు అల్లంను సేవిస్తే ఈ వ్యాధిబారినపడినవారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది.

** పండ్ల విషయానికి వస్తే ఋతువులననుసరించి వచ్చే పండ్లు, బొప్పాయి, దానిమ్మ, చీని, జామ, ద్రాక్ష తదితర పండ్లుకూడా తీసుకోమని వైద్యులు సూచిస్తున్నారు.

** మీగడలేని పాలు, మజ్జిగ, సోయాబీన్ నూనె, ఆవు నెయ్యి, బెల్లం, తేనె తదితరాలు సేవించవచ్చంటున్నారు వైద్యులు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఆరోగ్యానికి ఆయుధం సైకిల్...!
చదువుతూ అలసిపోతున్నారా...!
ఆరోగ్యంగా ఉండాలనుకుంటే...!
జలుబుతో బాధపడుతుంటే తులసి తీసుకోండి
చుండ్రును తరిమికొట్టండిలా...!
నిత్య యవ్వనంగా ఉండాలంటే...!