** నిత్యం ఆరోగ్యంగా ఉండేందుకు ఉదయంపూట త్వరగా నిద్రనుండి మేల్కొనాలి. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత పరకడుపున నిమ్మకాయ రసం సేవించాలి లేదా రాగి పాత్రలో రాత్రి పోసి పెట్టిన నీటిని సేవించండి. దీంతో ఆరోగ్యంగా ఉంటారంటున్నారు వైద్యులు.
** ఉదయం, సాయంత్రం తేలికపాటి వ్యాయామం చేయండి. సాధారణంగా రెండుపూటలా నడక ప్రారంభించండి. ముఖ్యంగా కాలుష్యం లేని ప్రాంతంలో తిరిగేందుకు ప్రయత్నించండి.
** మీరు తీసుకునే అల్పాహారంలోను, భోజనంలోనూ రుచికరమైన ఆహార పదార్థాలుండేలా చూసుకోండి.
** పాచిపోయిన, కుళ్ళిపోయిన, మాడిపోయిన ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకండి. దీంతో అనారోగ్యంబారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నయంటున్నారు వైద్యులు.
** నిత్యం ఎన్నో పనులతో సతమతమవుతుంటారు. ఇందులో భాగంగా శరీరానికి, ఆరోగ్యానికి సంబంధించినంతవరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం విచారకరం. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి రోజూ స్నానం, ప్రార్థన చేయడం మరువవద్దు. |