కొందరు మరీ బలహీనంగా, పీలగా, సన్నగా కనపడుతుంటారు. ఇలాంటివారు శరీర బరువును పెంచుకునేందుకు నానా అవస్థలు పడుతుంటారు. అయినాకూడా వీరు బరువు పెరగరంటే అతిశయోక్తికాదు. 'తిండి కలిగితే కండ కలదోయి... కండ కలవాడేను మనిషోయి' అని మహాకవి గురుజాడ అప్పారావు అన్నారు. దీంతో శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కండ కలిగి ఉండాలి.కాని ఇలాంటివారు బరువు పెరగదలచుకుంటే దుగ్ధకల్ప వాడితే చాలా లాభదాయకమని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు. దీంతోపాటు నిత్యం డ్రైఫ్రూట్స్, అంటే ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరపు పండులాంటివి తీసుకుంటుండాలి. అలాగే గోధుమ రవ్వతో తయారు చేసిన జావను నిత్యం సేవిస్తుంటేకూడా బరువు పెరుగుతారంటున్నారు వైద్యులు. ప్రకృతిపరంగా లభ్యమయ్యే ఫలాలు అన్నికూడా తింటుండాలి. ఇలా నిత్యం ఈ పదార్థాలను తీసుకుంటుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు వైద్యులు. |