మహిళలు సాధారణంగా కోడి కూసే వేళకన్నా అందరికంటే ముందుగా నిద్రలేచి అందరికి కావలసినవి సమకూర్చిపెడుతుంటారు. ఉదయమే పని ఒత్తిడికారణంగా వారికి తరచూ తలనొప్పి వస్తుంటుంది. దీనికి కొన్ని చిట్కాలు
** తలనొప్పి ఉంటే ముందుగా మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి.
** ఏకాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.
** మీ తల వెంట్రుకల ముడిని తీసేయండి.
** పడకపై ఎలాంటి దిండు లేకుండా కాసేపు పడకోండి. దీంతో మీ తలనొప్పి మటుమాయం అంటున్నారు వైద్యులు.
** మీ శ్వాసక్రియపై మీ మనసును లగ్నం చేయండి.
** మీకుగనుక ప్రాణాయామం చేసే అలవాటుంటే ప్రాణాయామం చేయండి. లేకుంటే చేయకండి.
** దీర్ఘశ్వాస క్రియతో శరీరంపై మీరు పట్టును సాధించవచ్చు.
** మీ రెండు చేతుల బొటనవేళ్ళను మీ చెవుల వెనుకవైపుంచి సుతిమెత్తగా అదమండి.
** మెల్లగా మీ చేతివేళ్ళను తలపైన ఉంచి కాసేపు అదిమి పట్టండి.
** ఇప్పుడు మీరు ప్రశాంతంగా కూర్చోండి. |