** ప్రతిరోజు 35 నుంచి 40 నిమిషాలపాటు వేగంగా నడవండి.** భోజనం ఒకేసారి తినకుండా అప్పుడప్పుడు కొద్దికొద్దిగా తినండి. ** నిత్యం మీరు తీసుకునే ఆహారంలో రీఫండ్ నూనెను అతి తక్కువగా వాడితే మంచిదంటున్నారు వైద్యులు. ** మీ వైద్యులు సూచించిన మేరకు భోజనం చేయండి. ** మీరు తీసుకునే భోజనంలో ఎక్కువగా ఫైబర్ ఉండే ఆహార పదార్థాలు తీసుకోండి. దీంతో మీ శరీరంలోని రక్తంలో గ్లూకోజ్ స్థాయి నిదానంగా పెరుగుతుంది. దీంతో రక్తంలోని గ్లూకోజ్ స్థాయి స్థిరంగా ఉంటుంది. ** మధుమేహ రోగులు ఎట్టి పరిస్థితుల్లోను ఉపవాసం ఉండకండి. అలాగే విందుల్లో పాల్గొన్నప్పుడు అదేపనిగా లాగించకండి. ఈ చిట్కాలను పాటిస్తే మధుమేహాన్ని మీ ఆధీనంలో ఉంచుకోవచ్చంటున్నారు వైద్యులు. |