ఫుడ్ పాయిజన్ అనే మాట తరచూ వింటుంటాం... దీంతో కడుపులో ఇబ్బందికరంగా ఉండటం. కొడుపునొప్పి, వాంతులు, విరేచనాలుంటాయి. ఇది మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, నూనె పదార్థాల కారణంగా ఫుడ్ పాయిజన్ కలుగుతుందంటున్నారు వైద్యులు.
ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వెంటనే తమ ఆహారపు అలవాట్లను మార్చుకోండి. నూనెతో చేసిన పదార్థాలు తీసుకోకపోవడం ఉత్తమం. తక్కువగా ఆహారం తీసుకుంటే ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉంటుంది. తరచూ తాజా పండ్లను సేవించండి.
ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన సలాడ్‌లు, ఇతర ఆహార పదార్థాలను తీసుకోవడం మానండి. కొబ్బరి నీళ్ళు ఎక్కువగా సేవిస్తుండండి. శరీరానికి నీరు చాలా అవసరం. కాబట్టి ప్రతి గంటకోసారి నీటిని సేవిస్తుండాలంటున్నారు వైద్యులు.