పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » చిట్కాలు » ఆరోగ్యంగా ఉండాలంటే సానుకూల దృక్పథం అవసరం (health tips | health and fitness tips | beauty tips | health diet)
 
సానుకూల దృక్పథం: సానుకూల దృక్పథమే మీ సంఘర్షణభరితమైన జీవతంలో మీకు తోడుగా ఉంటుంది. అలాగే మిమ్మల్ని జబ్బులనుంచి కాపాడుతుందంటున్నారు పరిశోధకులు.

సానుకూల దృక్పథాన్ని అవలంబించేవారితో స్నేహం చేయండి. ముఖ్యంగా మీ చుట్టుప్రక్కల ఉండేవారు కూడా సానుకూల దృక్పథంతో ఆలోచించేవారే ఉండాలి.

దయార్థృ హృదయం: ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ పై మీరు దయ చూపండి. మీ ఆలోచనా దృక్పథం సానుకూలంగా ఉండేలా చూసుకోండి.

నమ్మకం: ప్రపంచం మొత్తం కూడా నమ్మకం మీదే ఆధారపడి ఉంది. ఆ నమ్మకమే మీమ్మల్ని ఇంత దూరం తీసుకువచ్చిందని మీరు నమ్మాలి. మీ నమ్మకమే మీకు దిశానిర్దేశాన్ని తెలుపుతుంది.

ప్రేరణ: ఏ వ్యక్తి అయితే మీకు ప్రేరణ కలిగిస్తారో, ఆ వ్యక్తి ప్రేరణను మీరు తీసుకోండి. ముఖ్యంగా చదవడం అలవాటు చేసుకోండి. వార్తాపత్రికలతోపాటు పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోండి.

స్మైల్: స్మైల్(నవ్వు) అన్నింటికన్నా ముఖ్యమైనది మీ చిరునవ్వు. మీ చిరునవ్వే ఇతరులను మంత్రముగ్దులను చేసేదిగా ఉండాలి.

రిలాక్స్‌డ్: ప్రతి రోజు ఎన్నో సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. దీంతో మానసికంగా ఒత్తిడి, ఈ ఒత్తిడి కారణంగా ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం కనపడుతుంటుంది. ఒత్తిడినుంచి ఉపశమనం పొందేందుకు మీరు వెంటనే ప్రయత్నించండి.

మీ మనసును కేంద్రీకరించండి : ఏ విషయమైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదిగా ఉంటుందో దానిని అతిగా ఆలోచించకండి. వీలైనంతమేరకు ఆలోచనలను తొలగించుకునేందుకు ప్రయత్నించండి.

ప్రేమ గురించి ఆలోచించండి : ప్రతి ఒక్కరు తమ తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా ప్రేమలో పడుతుంటారు. ఎవరినో ఒకరిని ప్రేమిస్తుంటారు. ఆ ప్రేమకు సంబంధించిన మధుర స్మృతులు గుర్తుకు తెచ్చుకుంటుంటే మీకు బలం చేకూరుతుందంటున్నారు శాస్త్రజ్ఞులు. ఇందులో మీకు నచ్చిన, మీరు మెచ్చిన వాటినే గుర్తుకు తెచ్చుకోండి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.