** ఒక కప్పు నీటిలో నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేసి మరగనిచ్చిన నీరు త్రాగండి ఉపశమనం కలుగుతుంది.
** జలుబుతో బాధపడేవారు చికెన్‌సూప్ తీసుకుంటే అద్భుతమైన ఫలితం ఉంటుందంటున్నారు వైద్యులు.
** ఐదు తులసి ఆకులు తీసుకొని నమలండి. నమిలిన తర్వాత వచ్చే రసాన్ని మింగేయండి. అలా చేయడం ఇష్టం లేకపోతే తులసి ఆకులతో డికాషన్ పెట్టి ఆ డికాషన్‌ను రోజుకు మూడు నాలుగు సార్లు త్రాగండి ఫలితం ఉంటుంది.
** ఒక నిమ్మపండురసం, రెండు కప్పులు గోరువెచ్చని నీటిలో కల్పి ఒక స్పూన్ తేనె కల్పి రోజుకు రెండు మూడు సార్లు తీసుకొంటుంటే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.