** జీవితం బిజీబిజీగా తయారయ్యింది. దీంతో చాలామందికి తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ లేదనే చెప్పాలి. నేటి బిజీ జీవితంలో కూడా శరీరాన్ని మంచి కండీషన్‌లో ఉంచుకోవాలనుకుంటే వ్యాయామం ఉత్తమం. దీంతో శరీరం పుష్టిగా తయారవుతుందంటున్నారు వైద్యులు.
** కార్డియోవాస్క్యులర్ వ్యాయమం చేస్తుంటే శరీర కండరాలు పుష్టిగా ఉంటాయి.
** నిత్యం వ్యాయామం చేస్తుంటే కీళ్ళ నొప్పుల సంబంధిత బాధలు తగ్గుతాయి.
** నియమానుసారం వ్యాయామం చేస్తుంటే రక్తప్రసరణ సజావుగా జరుగుతుంది.
** శరీరంలో ఎండార్ఫిన్ ప్రసరిస్తుంది. ఇది శరీరంలోని నొప్పులను నివారిస్తుంది.
** వెన్ను నొప్పి, డిస్క్‌పై తీవ్రమైన భారంపడి నొప్పి కలుగుతుంటే నడక చాలా మంచిదంటున్నారు వైద్యులు.