రాత్రిపూట భోజనం ముగించిన తర్వాత చాలామంది నడక సాగిస్తుంటారు. ఏమంటే నైట్ వాకింగ్ అని. ఇది ఓ మంచి అలవాటే, కాని నడిచేటప్పుడు వేగం విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించాలంటున్నారు వైద్యులు.
మీరు నడిచే నడక వేగం మీ గుండెమీద కాస్త ఎక్కువ ఒత్తిడి పడి నొప్పి వచ్చే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. రాత్రి పూట నడక సాగిస్తే గుండెపోటు వచ్చే ప్రమాదమేమి లేదు, కాని వేగాన్ని మాత్రం మీ అదుపులో ఉంచుకుంటే ఆరోగ్యం పదికాలాలపాటు చల్లగా ఉంటుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.