పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » చిట్కాలు » చేపలు ఎక్కువగా తింటున్నారా...! (Health | Fish | Heart | Fats | Nutritions |)
Feedback Print Bookmark and Share
 
ఆరోగ్యంగా ఉండేందుకు చేపలు తినాలంటుంటారు పెద్దలు. ఎందుకంటే చేపలలో ఉండే ఒమేగా-3 ఫ్యాట్స్ గుండెకు మేలు చేస్తాయని, గుండెకు చేపలు చేసే మేలు అంతా ఇంతా కాదంటున్నాయి అధ్యయనాలు.

అలాగని చేపలు ఎక్కువగా తినడం వలన ఏ గుండె అయితే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంటామో అదే గుండెకు హాని జరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని క్లినికల్ న్యూట్రిషనిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు.


చేపల్లో ఉండే పాదరసం క్రమంగా శరీరంలో పేరుకుపోవడంతో గుండె, నాడీ వ్యవస్థలో మార్పులు సంభవించి సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. అదే పిల్లలోనైతే ఇది వారి పెరుగుదలను కాస్త తగ్గిస్తుందంటున్నారు న్యూట్రిషనిస్ట్‌లు.

పాదరసం తక్కువ మోతాదులో ఉండే చిన్న ట్యూనా చేపలు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు వైద్యులు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.