గుండెకు బలాన్నిచ్చేందుకు మందార పువ్వు ఎంతో లాభకారిగా ఉంటుందని వైద్యులు చెపుతున్నారు. జీవితంలో ఏర్పడే సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలను మందార పువ్వు మటుమాయం చేస్తుందంటున్నారు వైద్యులు.
మందార పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కారణంగా శరీరంలోని రక్తపోటు, అధిక కొవ్వును నియంత్రిస్తుంది. దీనిని యూనానీ మందుల్లోను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
ఎండబెట్టిన మందార పువ్వును టీలో కలుపుకుని సేవిస్తే శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. ఇందులో చక్కెర కలుపుకోకూడదు. దీంతో శరీరంలోని గ్లూకోజ్ శాతం క్రమబద్దీకరిస్తుందంటున్నారు వైద్యులు.