పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » చిట్కాలు » ఆరోగ్యానికి నీరు ఎంతో అవసరం! (Health | Body | Water | Doctor | Kidney | Stomach | Skin | Food)
Feedback Print Bookmark and Share
 
FILE
శరీరంలో ఎక్కువశాతం నీరే ఉంటుంది. ఈ నీరే ప్రాణాధారం. శరీరానికి తగినంత నీరు అందివ్వడంతో ఆరోగ్యంగా ఉంటారంటున్నారు వైద్యులు.

నీరు సేవించడం వలన శరీరంలోని విషపూరితమైన పదార్థాలు బయటకు విసర్జించడమే కాకుండా చర్మం, ఉదరం, మూత్రపిండాలలోనున్న పలురకాల విషపదార్థాలు బయటకు విసర్జించబడతాయి. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు రకరకాల జబ్బులు చోటుచేసుకుంటాయి. నీరు తక్కువగా తీసుకోవడంతో డీహైడ్రేషన్ సమస్య ఉత్పన్నమౌతుంది.

శరీరంలో చేరుకునే రకరకాల జబ్బులను నీరు పారద్రోలుతుంది. కాబట్టి శరీరానికి తగినంత నీరు అందిస్తుండాలి. శరీర బరువును నియంత్రించేందుకు నీరు ఓ దివ్యౌషధంలా ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును తొలగించేసే గుణం ఇందులో ఉంది. నీటిలో క్యాలరీలు, కొవ్వు, చక్కెర, కార్బోహైడ్రేట్లుండవు. నీటిని సేవించడం వలన ఎక్కువ క్యాలరీలు కలిగిన సోడా, డ్రింక్స్, మద్యం, ఇతర జ్యూస్‌లను త్రాగాలనిపించదంటున్నారు వైద్యులు.

శరీరంలో తగిన మోతాదులో నీరు ఉంటే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. నీటితో శరీరంలో శక్తి వస్తుంది. శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు అలసట కలుగుతుంది. దీంతో శరీరంలో శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. తరచూ గొంతు ఎండిపోవడం, కొందరిలో కళ్ళు తిప్పడం లాంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. అలసట కారణంగా కొందరిలో బలహీనత ఏర్పడుతుంది.

ఆరోగ్యకమైన చర్మ కోసం నీటిని ఎక్కువగా సేవించాలంటున్నారు వైద్యులు. తగిన మోతాదులో నీరు తీసుకుంటుంటే చర్మంలో నిగారింపు కనపడుతుంది. ఇది ఒక్కరోజులోనే జరగదంటున్నారు వైద్యులు. దీనికి నిత్యం నీటిని సేవిస్తుండాలి. అప్పుడే అనారోగ్యంబారిన పడకుండా ఉంటారంటున్నారు వైద్యులు.

భోజనం జీర్ణమయ్యేందుకు నీరు చాలా ఉపయోగపడుతుంది. ఇది ఉదరములోనున్న అన్ని రకాల సమస్యలను తొలగిస్తుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.