పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » చిట్కాలు » ఆరోగ్యానికి మాలిష్ చేసుకోండిలా...! (Body | Health | Malish | Exercise | Energy | Carpet | Oil)
Feedback Print Bookmark and Share
 
FILE
ఆరోగ్యంగా ఉండాలంటే రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. ప్రస్తుతం ఉరుకులు పరుగులమయమైన జీవితంలో చాలామందికి వ్యాయామం చేసే తీరికే లేదు. దీంతో ఇంట్లోనే వారానికి లేదా నెలకొసారైనా మీ శరీరాన్ని మాలిష్ చేయించుకుంటే శరీరంలో నూతన శక్తి ఉత్పన్నమౌతుందంటున్నారు వైద్యులు.

మాలిష్ చేసుకునేందుకు స్వచ్ఛమైన వాతావరణం ఉండాలి. నలువైపులా చల్లటి గాలి వచ్చేలా ఏర్పాటు చేసుకోండి. నేలపై మెత్తటి తివాచి లేదా చాపను పరచుకోండి. దీనిపై పద్మాసనం వేసుకుని ప్రశాంతంగా కూర్చోండి. మాలిష్ చేసుకునే సందర్భంలో ఎలాంటి మాటలు మాట్లాడకూడదు. మీ మనసు ఏకాగ్రతతో కూడుకుని ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మాలిష్ చేసుకునే సందర్భంలో తొలుత కాళ్ళనుంచి ప్రారంభించాలి. మాలిష్ మెల-మెల్లగా, నిదానంగా, సుతిమెత్తగా చేయాలి. ఇలా దాదాపు 20 నుంచి 25 నిమిషాలపాటు మాలిష్ చేయాలి. ఆ తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకోవాలి.

మీరు మాలిష్ చేసుకునేందుకు ఏ నూనెనైతే వాడుతారో ఆ నూనెను ఓ సీసాలో నింపి 6-7గంటలపాటు ఎండలో ఉంచాలి. నూనెతో నింపిన సీసాను నేలపై ఉంచకండి. ఏదైనా పీటపై నూనె సీసానుంచండి. ఎండలో బాగా కాగిన తర్వాత ఆ నూనెను శరీరానికి దట్టించి మాలిష్ చేయండి. దీంతో మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే సజావుగా శరీరంలో రక్తం ప్రశరణ జరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.