ఆస్తమాతో బాధపడుతుంటే టీ త్రాగడంవల్ల చక్కని ఫలితముంటుంది. ఒక్కోసారి ఊపిరి సలపకుండా దగ్గు వస్తునే ఉంటుంది. అలాంటి సమయంలో వేడి వేడి టీ త్రాగడం ద్వారా దగ్గు తగ్గి ఉపశమనం కలుగుతుంది. మసాలావేసిన ఆహార పదార్థాలు0 అధికంగా తినడం వలన కడుపులో వచ్చే మంటను సైతం టీ తగ్గిస్తుంది.
మలేరియా, ప్లూ జ్వరాలు ఉన్నప్పుడు టీ సేవిస్తే ఉపశమనాన్ని కలిగిస్తుంది. మూత్రం సాఫీగా పోసేందుకు తోడ్పడుతుంది. జ్వరం వచ్చినప్పుడు టీని నిరభ్యంతరంగా త్రాగొచ్చు. నోటికి రుచిగా ఉండకపోతే శొంఠి కలిపిన టీని తాగితే గొంతు గరగర తగ్గుతుంది.