ప్రస్తుతం రోజువారి పనులతో సతమతమైయ్యే వారికి మానసికపరమైన, శారీరక ఒత్తిడి చాలా అధికంగానే ఉంటుంది. ఈ ఒత్తిడి కారణంగా శరీర ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. దీంతో గుండెపై అత్యధికమైన ఒత్తడి పెరుగుతుంది.
ఇలా ఒత్తిడి పెరిగినప్పుడు మీరు తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలంటున్నారు వైద్యులు.
మీరు తీసుకునే సాచ్యురేటెడ్, ట్రాంస్ ఫ్యాట్ కలిగిన ఆహారం తీసుకుంటుంటే దానిని తగ్గించండి.
గుండె ఆరోగ్యంగా ఉండేందుకు పుష్టికరమైన ఆహారం తీసుకోవాల్సివుంటుంది. కాయగూరలు, పండ్లు, ఫలాలు, సగ్గుబియ్యం, పీచుపదార్థాలు కలిగిన ఆహార పదార్థాలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలంటున్నారు వైద్యులు.
ప్రతి రోజు అరగంటపాటు కసరత్తు చేయాలి. దీంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
సాధారణమైన వ్యాయామం అంటే నడక, మెట్లు ఎక్కడం, జాగింగ్ చేయడం తదితరాలు చేయాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.