** చాలామందికి తమ శరీర బరువు తగ్గాలనివుంటుంది. కాని సాధరణంగా వ్యాయామం చేసేందుకు సమయం లేదని దాటేస్తుంటాం. లేకపోతే ఆహారపు అలవాట్లను పాటించేందుకు వెనకడుగు వేసి ఏది దొరికితే దానిని తినేస్తుంటాం. కాని బరువు తగ్గేందుకు కొన్ని చిట్కాలు మీ కోసం.
** ప్రతి రోజు క్రమం తప్పకుండా మూడు యాపిల్ పండ్లను ఆహారంగా తీసుకోండి. యాపిల్ పండ్లలో తక్కువ క్యాలరీలుంటాయి. దీంతో శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. అలాగే ఎక్కువగానున్న శక్తిని హరించివేస్తుంది.
** శరీర బరువు తగ్గేందుకు అనువైన మార్గం సైకిలింగ్. సైకిల్ తొక్కడం వలన శరీరంలోని కొవ్వు కరిగి తేలికగా మారుతుందంటున్నారు వైద్యులు. కాబట్టి ప్రతి రోజు సైకిలింగ్ చేయడం చాలా ఉత్తమం.
** చాలా సేపు నిద్రపోతే కూడా శరీర బరువు తగ్గుతారని వైద్యులు సూచిస్తున్నారు. టీవీ చూడటం కట్టిపెట్టండి. దీంతో ఆరు శాతం క్యాలరీలు తగ్గుతాయి. అలాగే ఎల్లప్పుడూ కంప్యూటర్ ముందు కూర్చునిపని చేసేవారైతే వారికి నడక చాలా మంచిదంటున్నారు వైద్యులు. దీంతో శరీరంలోని బరువు తగ్గేందుకు ఆస్కారముంది.