టీ త్రాగడం వల్ల తేయాకులో వున్న పోషక విలువలు శరీరానికి లభ్యమవుతాయి. తేయాకులో కార్బోహైడ్రేట్, ఖనిజాలు లభిస్తాయి. విటమిన్ ఎ,బి,సి,ఇ,కె కూడా ఉంటాయి. ఇంకా కాపర్, ఐరన్, జింక్, మాంగనీస్ టీలో లభిస్తాయి.
ఇందులో కెఫిన్, పాలిఫినాల్స్ కూడా ఉంటాయి.టీ త్రాగడం రుచికేకాక శరీరారోగ్యానికి కూడా మంచిది. టీలో ఔషధ గుణాలు ఉన్నాయి.రోజుకు 2,3 కప్పుల టీని త్రాగితే శరీరానికి ఎలాంటి హాని జరగదు.
టీ త్రాగడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలుంటాయి. ముఖ్యంగా జీర్ణక్రియ బాగుంటుంది. కొంతమంది ఆహారం తిన్నవెంటనే టీని తాగుతారు. తిన్న ఆహారం తేలికగా జీర్ణమవుతుందని కొన్ని ప్రాంతాలవారు అలా చేస్తారు.
మానసిక శారీరక అలసటను తొలగిస్తుంది. ఆఫీసులో, ఇంటిలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండి బడలికగా ఉన్నప్పుడు ఒక స్ట్రాంగ్ టీని తాగితే మనసు ఉత్సాహంతో ఉరకలు వేస్తుంది.
బ్లాక్ టీ రక్తంలోని కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. కొలస్ట్రాల్ అధికమవుతే గుండెనొప్పి వచ్చే ప్రమాదం ఉంది. అందుకని వేడివేడిగా ప్రతి నిత్యం బ్లాక్ టీ తాగడం ద్వారా కొలస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. తద్వారా వచ్చే కొవ్వు శాతం తగ్గించుకోవచ్చంటున్నారు వైద్యులు.