** ఇంట్లో చెమ్మకలిగిన దుస్తులు ఆరబెట్టకండి. ఇంటిని చెమ్మ గుడ్డతో తుడవండి. గోడలపై బూజు ఉంటె దానిని శుభ్రపరచండి.
** ధూమపానం చేయకండి. ధూమపానం చేసేవారికి దూరంగా ఉండండి. ఇంట్లో ఎవ్వరినీ ధూమపానం చేయనివ్వకండి.
ముఖ్యంగా చలికాలంలో ఆరోగ్యం బాగుంటుంది. కాని చలికాలంలో కొన్ని ముఖ్యమైన వ్యాధులు ఉదాః ఆస్తమా, గుండెకు సంబంధించిన వ్యాధుల వారు. క్యాన్సర్ కలిగిన వారుంటే పడక గదిని శుభ్రంగా ఉంచండి.
ప్రధానంగా చలికాలంలో గుండెకు సంబంధించిన రోగాలతో బాధపడుతుండే వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలున్నాయంటున్నారు వైద్యులు. అలాగే శ్వాసక్రియకు సంబంధించిన రోగులకు ఇది చాలా ఇబ్బంది కలిగించే కాలం. క్యాన్సర్, మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారికి కూడా ఈ చలికాలం ఎంతో క్లిష్టమైన కాలం.
దీంతోపాటు చలికాలంలో చర్మానికి సంబంధించిన వ్యాధులు, అలర్జీ తదితర జబ్బులు ప్రబలే అవకాశాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి మీ పడకగదిని పరిశుభ్రంగా ఉంచండి.