**ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల చిట్కాలు ఉపయోగిస్తుంటాం. ఇందులో భాగంగా కీళ్ళ నొప్పులతో బాధపడుతుంటే వేడి నీటిలో నిమ్మకాయ రసాన్ని పిండి ప్రతి రోజు 8 నుంచి 10 సార్లు సేవించండి. దీంతో కీళ్ళ నొప్పులు మటుమాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
** అలాగే కీళ్ళపై వేప నూనెతో మెల్లగా మాలిష్ చేస్తే ఉపశమనం కలుగుతుంది.
** అరికాళ్ళు మంటగా ఉంటే సొరకాయ గుజ్జును అరికాళ్ళకు పూస్తే మంట తగ్గి ఉపశమనం కలుగుతుంది.
** శరీరంలో ఏదైనా భాగంలో ఉదాః చేతులు, కాళ్ళలో మంటగా ఉంటే పుచ్చకాయలోని తెల్లటి భాగాన్ని తీసుకుని అందులో కర్పూరం, చందనం కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని మంటగా ఉన్న చోట పూయండి. దీంతో మంట తగ్గి ఉపశమనం కలుగుతుంది.