** మనిషి మెదడు ఒత్తిడికి లోనవుతుంటే శారీరకంగా ఇబ్బంది పెడుతుంది. దీంతో పనిమీద శ్రద్ధ చూపించలేకపోవడం లాంటివి జరుగుతాయి. ఈ సమస్యను అధిగమించాలంటే మీరు తీసుకునే ఆహారంలో పోషక విలువలుండాలి.
** మానసికపరమైన ఒత్తిడిని ఎదుర్కొనేవారు చేపలు ఎక్కువగా తీసుకుంటుండాలి. వపీటిలో ఫఅయాటీ ఆమ్లాలు శరీరంలోని నరాలను పటిష్టం చేస్తాయంటున్నారు వైద్యులు.
** చేపలు తినడం ఇష్టపడని వారు చేప నూనెలు ఉపయోగించినా మంచి ఫలితాలను పొందుతారు. అలాగే తరచూ స్ట్రాబెర్రీ తీసుకోవడం వలన మీ మెదడులో చురుకైన ఆలోచనలు కలుగుతాయి.
** అలాగే ఆకు కూరలు తీసుకున్నా మంచి ఫలితాలుంటాయి. ఇందులో ఫోలిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది. పాలకూరను ఎక్కువగా తీసుకుంటుంటే శరీరంలోని అలసట మటుమాయమవుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.