సంగీతాన్ని మనసారా ఆస్వాదిస్తూ వింటుంటే ఎన్నో అద్భుతాలు జరుగుతాయని చెప్పలేం. కాని మనస్సు పొరల్లో ఆవరించివున్న ఒత్తిడిని, దిగులును ఇట్టే తొలగించే శక్తి సంగీతానికి ఉంది. మూడ్‌ను త్వరగా మార్చే శక్తి సంగీతానికి ఉంది. ఒత్తిడినుంచి ఉపశమనాన్ని కలిగించి. ప్రశాంత వాతావరణాన్ని సమకూరుస్తుంది.
సరైన సంగీతాన్ని ఎంచుకోవడం అవసరం. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అభిరుచి ఉంటుంది. దానికి అనుగుణమైన సంగీతాన్ని ఎంచుకోవాలి. ఏ సంగీత సాధనం పైనా అయినా వినిపించే పాటలు, సంగీతం, చివరకు కూనిరాగాలకు సైతం సంతోషాన్నిచ్చే శక్తి ఉంటుంది. ఎప్పుడు ఒత్తిడిగా ఉన్నా ఇష్టమైన సంగీతాన్ని కొద్ది సేపు వింటే చాలు. ప్రకృతి శబ్దాల ప్రభావాన్ని చూపుతాయి. ఒత్తిడిని తగ్గించడంలో శాస్ర్తీయ సంగీతానికి మించినది మరొకటి లేదని నిపుణులు చెప్తారు. డ్రైవింగ్‌లో, పనిలో, చివరకు నిద్రించేముందు కూడా సంగీతాన్ని వినవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
సంగీతం గుండె దడను తగ్గించి శారీరక ఉష్ణోగ్రతను పెంచుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.