మీరు, మీ పిల్లలు ఊబకాయంతో బాధపడుతుంటే వారాంతపు సెలవునాడు బాగా నిద్రపోండి. ఎందుకంటే వారాంతపు రోజున బాగా నిద్రపోతే పిల్లలు, లేదా మీ శరీరంలోని బరువు తగ్గి స్లిమ్‌గా తయారవుతారని తమ పరిశోధనల్లో తేలినట్లు హాంగ్‌కాంగ్‌లోని చైనీస్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రజ్ఞులు తెలిపారు.
తాము జరిపిన పరిశోధనల్లో పిల్లలు చాలా సమయం వరకు నిద్రపోయేవారైతే అలాంటి వారి శరీర బరువు తగ్గి నాజూకుగా తయారైనారని, ముఖ్యంగా వారాంతపు రోజున బాగా నిద్రపోతే మరింత స్లిమ్‌గా తయారవుతారని పరిశోధకులు తెలిపారు.
పిల్లలు బాగా నిద్రపోతే వారి శరీరంలోని క్యాలరీలు తగ్గుతాయని, తాము నిర్వహించిన పరిశోధనల్లో 5 నుంచి 15 సంవత్సరాలలోపు పిల్లలు దాదాపు 5 వేలమందిపై వారి జీవన శైలి, ఆహార నియమాలు, నిద్ర తదితరాలపై పరిశోధనలు జరిపామని వారు పేర్కొన్నారు.
ఏ పిల్లలైతే సెలవుల్లో లేదా వారంతపు సెలవుల్లో బాగా నిద్రపోతుంటారు అలాంటి వారు తక్కువగా నిద్ర పోయేవారికన్నా స్లిమ్‌గా తయారవుతారని తమ పరిశోధనల్లో తేలిందని పరిశోధకులు తెలిపారు.
FILE
ఎక్కువ బరువు కలిగిన వారు వారాంతపు సెలవు రోజున తక్కువగా నిద్రపోతున్నారని, ఇలాంటి వారికి వారాంతపు సెలవు రోజున ఎక్కువ సేపు నిద్రపుచ్చేందుకు అవకాశం కల్పించాలని పిడియాట్రిక్ జర్నల్ తెలిపింది. ఇది కేవలం పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా ఉపకరిస్తుందని జర్నల్ పేర్కొంది.