సువాసనలు వెదజల్లే రూపం అమ్మాయిదయినా, అబ్బాయిలదైనా ఆకట్టుకుంటుంది. చెమట వాసన ఎవరి శరీరం మీదయినా దుర్వాసనే వస్తుంది. ఎక్కుగా బయటతిరిగే ఉద్యోగస్తులు ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాల్సి వుంటుంది.
1. పెరిగిన గడ్డం ,బాహుమూలాల్లో వున్న అవాంఛిత రోమాలను పూర్తిగా తొలిగించుకోవాలి.
2.వాతావరణ పరిస్థితులను బట్టి రోజులో రెండుసార్లు కన్నా ఎక్కువమార్లు స్నానం అవసరమైతే చేయండి. నిద్రకు ముందు ఒకసారి తరువాత మరొకసారి తప్పనిసరిగా స్నానం చేయాలి.
3.నీరు ఎంత ఎక్కువ తాగితే చెమట వాసన అంత తక్కువ వుంటుంది. తాగిన నీరు శరీరంలోని మలిన పదార్ధాలను బయటకు నెట్టివేస్తుంది. తద్వారా శరీర దుర్వాసనను నిరోధిస్తుంది.
4.స్నానం తరువాత శరీరంలో ఏ భాగంలో కూడా తడి మిగలకుండా శుభ్రంగా తుడుచుకోవాలి.
5.చెమటతో తలభాగం వాసన వస్తుంది. కాబట్టి నాణ్యమైన షాంపూని మాత్రమే వాడండి. తలకు రాసిన నూనె తొలిగించే షాంపూని ఎంపిక చేసుకోవాలి.