ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > యోగా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
యోగాతో వృద్ధ మహిళలకు స్థిరత్వం
వృద్ధ మహిళలకు ప్రత్యేకంగా రూపొందించిన యోగా ప్రక్రియతో వారు ముసలి వయసులో తూలి పడిపోకుండా శరీరాన్ని సమతూకంగా ఉంచుకోవచ్చని వైద్య పరిశోధకులు పేర్కొన్నారు. వాషింగ్టన్‌లోని టెంపుల్ యూనివర్శిటీ హెల్త్ ప్రొఫెషన్స్ కాలేజీకి చెందిన డాక్టర్ జిన్సుప్ తదితర పరిశోధకులు 65 ఏళ్లు దాటిన మహిళలకోసం ప్రత్యేకంగా రూపొందించిన అయ్యంగార్ యోగా ప్రోగ్రామ్‌లో పాల్గొంటున్న 24మంది వృద్ధ మహిళలల్లో శారీరక పటుత్వం, సమతుల్యత మెరుగుపడినట్లు నిర్ధారించారు.

9 వారాల ఈ యోగా కార్యక్రమం పూర్తయ్యాక చూస్తే 65 ఏళ్లు దాటిన వృద్ధ మహిళల నడకలో సమతూకం గణనీయంగా మెరుగుపడిందని వీరు ప్రకటించారు. అయ్యంగార్ యోగా కార్యక్రమంలో పాల్గొన్న వృద్ధ మహిళలు తమ నడకను ఎంతో మెరుగుపర్చుకున్నారని వారి పాదాల్లోని నరాలు పటుత్వం సాధించి వారి నడకకు స్థిరత్వం కల్పించాయని ఈ అధ్యయనం ప్రధాన పరిశీలకుడు సాంగ్ చెప్పారు.

గతంలో ఎలాంటి యోగా అనుభవంలేని వృద్ధ మహిళలకు సుప్రసిద్ధ యోగా నిపుణులు బికెఎస్ అయ్యంగార్‌‌ను సంప్రదించి ఒక ప్రత్యేక యోగా ప్రోగ్రాంను రూపొందించారు. అయ్యంగార్ యోగాలో పాల్గొన్న మహిళలు సజావుగా నడవడానికి సంబంధించి తమ విశ్వాస స్థాయిని బాగా మెరుగుపర్చుకున్నారని సాంగ్ తెలిపారు.

గతంలో వృద్ధ మహిళలకు కఠినతరమైన యోగాభ్యాసం నేర్పించేవారని, ఈ కొత్త ప్రక్రియలో శ్వాస, నిలబడడం, యోగా భంగిమ వంటివి సరళరూపంలో మార్చి అభ్యాసం చేయించినట్లు సాంగ్ చెప్పారు. ఈ తాజా ప్రక్రియలో పాల్గొన్న కొందరు మహిళలకు గతంలో ఉన్న వీపు నొప్పి, మోకాలి నొప్పి వంటివి పూర్తిగా తొలగిపోయినట్లు పరిశోధకులు తెలిపారు.
మరిన్ని
టైప్ 2 మధుమేహానికి విరుగుడుగా టాయ్ చి
మైగ్రేయిన్ తలనొప్పికి యోగా పరిష్కారం
చిరునవ్వుల థెరపీ: ప్లాస్టిక్ నవ్వులకు గుడ్‌బై
ఆస్త్మాను తరిమే హాస్య యోగా
అంతు తెలియని జ్వరాల నివారణలో యోగా
బాధను నివారించే 'విపాసన'