మీరు మెత్తటి తివాచీపై కూర్చుని మీ ఎడమ కాలును కుడి కాలుమీదుగా పెట్టండి. కుడి చేతిని భుజం మీదనుండి వెనక్కి తెచ్చి, పక్కనుండి తెచ్చిన ఎడమ చేయితో కలిపి రెండు చేతుల వ్రేళ్ళను కొక్కెంలా పట్టుకోవాలి. అలా పట్టుకుని గాలిని బాగా లోపలికి పీల్చకోవాలి. తిరిగి కుడి కాలును ఎడమ కాలుపై వేసి పూర్తి ఆసనం వ్యతిరేక దిశలో చేయాలి. ఈ ఆసనాన్ని గోముఖాసనం అంటారు.
ఈ ఆసనం చేయడంవలన గుండె, ఊపిరి తిత్తులకు మర్ధనా చేసినట్టవుతుంది. తుంటి, వీపు, భుజం, కీళ్ళనొప్పులను తగ్గిస్తుంది. అధిక రక్త పోటు కలవారికి, ప్రొస్టేట్ గ్రంథి సమస్య కలవారికి, ఆస్త్మా అలాగే ఇతర శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడేవారికి ఈ ఆసనం మేలు చేస్తుందని వ్యాయామ నిపుణులు పేర్కొన్నారు. |