నాలుగు కాళ్ళు కలిగిన ఇనుప చట్రంమీద చేతులు పెట్టడానికి అనువైన వెడల్పు భాగం మీద చేతులువుంచి, శరీర బరువును మోసేందుకు తమ భుజాలను సిద్ధంచేసి నెమ్మదిగా కాళ్ళు పైకి ఎత్తాలి. క్రమక్రమంగా శరీరం తూలకుండా నిలుపుతూ మొత్తం శరీరం తలకిందులుగా నిలపాలి.
ఈ ఆసనంలో శ్వాసక్రియ మామూలుగా జరపాలి. తిరిగి సాధారణ స్థితికి వచ్చి కాసేవు శవాసనం వేయాలంటున్నారు యోగా గురువులు. ఈ ఆసనం భయపడేంత కష్టమైన ఆసనం కాదంటున్నారు వారు.
ఇదిలావుండగా ఈ ఆసనం వేయడం వలన తలకు రక్త సరఫరా బాగా జరిగుతుందని, కానీ తీవ్ర రక్తపోటు కలవారు, గుండె జబ్బులున్నవారు, అల్సర్, తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడేవారు ఈ ఆసనాన్ని వేయకూడదంటున్నారు యోగా నిపుణులు. |