ప్రకృతిపరమైన సౌందర్యం, కోమలమైన శరీరం కావలనుకునే అమ్మాయిలు చాలామందే ఉంటారు. ఇలాంటివారికి యోగా చాలా యోగదాయకమైందని అంటున్నారు యోగా గురువులు. యోగా చేయడంవలన అమ్మాయిలు సెక్సీగాకూడా ఉంటారంటున్నారు యోగా నిపుణులు. దీంతో ముఖం, శరీరంలో కాంతి వస్తుంది.
ముఖంలో కాంతి :
శరీర రంగు ఏదైనా ఉండొచ్చు. కాని ముఖంలో కళ ఉట్టిపడాలంటే మీరు తప్పనిసరిగా యోగా చేయాలి. దీంతో ప్రతి ఒక్కర దృష్టి మీపైనే ఉంటుంది. ముఖంలో ఉట్టిపడే కళకు మనయొక్క కడుపుకు సంబంధం ఉంది. ఇవి రెండు శుభ్రంగా ఉంచుకోవడానికి నాలుగు ఉపాయాలున్నాయి. వీటిని తప్పనిసరిగా పాటించాలంటున్నారు యోగా నిపుణులు.
1. కంఠాన్ని శుభ్రం చేసుకోవాలి. 2. నోటికి సంబంధించిన వ్యాయామము, బ్రహ్మముద్ర. 3. సర్వాంగాసనం మరియు శీర్షాసనం వేయాలి. 4. జలనేతి మరియు కపాల భాంతి ప్రాణాయామం. వీటిని చేసిన తర్వాత ఐదు నిమిషాలవరకు ధ్యానం తప్పనిసరిగా చేయాలి.
శరీర సౌందర్యం :
శరీరం ఆరోగ్యంగా ఉంటే ఆకర్షణీయంగాకూడా కనపడుతుంటారు. దీంతో శరీరం అందంగా కనపడుతుంది. శరీర సౌందర్యం మన వెన్నెముక, శరీర కండరాలపై ఆధారపడివుంటుంది. శరీరంలో అనవసరమైన కొవ్వు ఉంటే అది వెన్నెముకకు, శరీర కండరాలకు హాని చేస్తుంది. అలాగే శరీరంలో అసలు కొవ్వే లేకుంటే కూడా చాలా ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు. దీనికి సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. దీనికికూడా నాలుగు ఉపాయాలున్నాయంటున్నారు యోగా నిపుణులు.
1. సూక్ష్మమైన వ్యాయామం చేయండి. 2. ఆరు ఆసనాలు తప్పనిసరిగా చేయాలి- తాడాసనం, త్రికోణాసనం, పశ్చిమోత్తాసనం, ఉష్ట్రాసనం, ధనురాసనం, నౌకాసనం. 3. ప్రాణాయామం. 4. మాలిష్.
ఇవి తప్పనిసరిగా చేస్తే శరీర రంగు ఏదైనా ఉండొచ్చు అమ్మాయిల శరీరం కోమలంగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా ఉంటూ, ముఖం కళ కళలాడుతుంది. అలాగే ఆహారంలోకూడా జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో మంచిదంటున్నారు యోగా గురువులు. |