ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > యోగాసనాలు > అందంగా లేనా...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అందంగా లేనా...!
FILE
అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటుంటారు. కొంతమంది శరీరం అందంగా ఉంటే ఏం చేస్తారు. మనసు అందంగా ఉండాలని అంటారు. మనసు అందంగా ఉండటానికి శరీర సౌందర్యం ప్రధానం. దీనికి యోగా సమాధానమేంటో ప్రస్తుతం తెలుసుకుందాం...

ప్రపంచంలో ఎక్కువమంది దేహ సౌందర్యంకోసం తహతహలాడుతుంటారు. శరీరంపై రకరకాల మందులను, క్రీములను పూస్తుంటారు. అంతేగాని సహజ సౌందర్యంకోసం ప్రాకులాడటం కోసం చేసే ప్రయత్నాలు వ్యర్థం. కేవలం దేహ సౌందర్యం కోసం ప్రాకులాడకూడదు. మానసిక సౌందర్యంకోసం కూడా ప్రయత్నించాలి.

అయితే ఏం చేయాలి...?

ప్రాణాయామం : శ్వాసక్రియలో తగిన జాగ్రత్తలు పాటించాలి శ్వాస క్రియను కాసేపు నిలుపుదల చేయండి. ఇలా మీ మనసుకు, శరీరానికి కాస్త తడబాటునివ్వండి. ఆ తర్వాత బిగ్గరగా అరవండి, గెంతులెయ్యండి, పాటలు పాడండి, ఏడ్వండి, స్టెప్పులేయండి,

పూర్తిగా మిమ్మల్నిమీరు మైమరచి పిచ్చివానిగా తయారవ్వండి. ఇది కేవలం పది నిమిషాలు మాత్రమే. ఆ తర్వాత పది నిమిషాలు ధ్యానం చేయండి. దీనిని పిచకారి పద్ధతి అని అంటారు యోగా నిపుణులు.

ఎందుకంటే శరీరంలో ఏదైతే విషపూరిత కణాలుంటాయో అవి తొలగిపోతాయి. దీంతో శరీరంలోని అనవసరపు కొవ్వుకూడా కరుగుతుంది. శరీరం సౌష్టవంగా మారుతుంది.ఇలా చేస్తే శరీరంలోనే కాకుండా ముఖంలో కాంతి పెరిగి కళకళలాడుతుంటారని యోగా నిపుణులు సూచిస్తున్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
చర్మ సౌందర్యానికి సూర్య నమస్కారం
ఎసిడిటీని తగ్గించే ఉత్థాన పాదాసనం
లింగ ముద్ర
యువతులకు అందాన్నిచ్చేది యోగా
శీర్షాసనం వేయండిలా..!
పద్మాసనం చేయండిలా..!