ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > యోగాసనాలు > కంప్యూటర్‌తో ఎంతసేపు పని చేస్తున్నారు...?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కంప్యూటర్‌తో ఎంతసేపు పని చేస్తున్నారు...?
మీ జ్ఞాపక శక్తిని కాపాడుకోవాలనుకుంటే పగలంతా మీరు చేసిన పనిని రాత్రివేళ తిరగదోడండి. అలా ఆలోచిస్తూ నిద్రకుపక్రమించండి. మీరు ఏదైతే ఆహారంగా తీసుకున్నారో దానిని ఒక్కసారి స్మరించుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలసటను దూరం చేసుకోవాలనుకుంటే ముఖ్యంగా ధ్యానం, యోగనిద్రను అలవాటు చేసుకోండి.

యోగా ఎక్సర్‌సైజ్ : ముఖ్యంగా కంప్యూటర్ ముందు కూర్చుని తదేకంగా పని చేసేవారు కనుగుడ్లను రెండుమూడు సార్లు పైకి, క్రిందకు గుండ్రంగా తిప్పండి. దీంతో కళ్ళకు చెందిన కండరాలకు శక్తి వస్తుంది.

వెన్ను నొప్పి‌తో బాధపడుతుంటే మీ రెండు మోచేతులను కలుపుతూ శ్వాసను పూర్తిగా పీల్చుకుని రెండు సార్లు వదలండి. ఆ తర్వాత రెండు చేతుల వేళ్ళను మీ భుజాలపై ఉంచండి. మళ్ళీ రెండు మోచేతులను ముందుకు వెనుకకు తిప్పండి. ఇలా 5 నుంచి 6 సార్లు చేయండి. దీంతో వెన్ను నొప్పి మటుమాయమౌతుందంటున్నారు వైద్యులు.

మెడను రెండువైపులా తిప్పండి. అలాగే ముందు-వెనుకకు తిప్పండి. ఆ తర్వాత మెడను గుండ్రంగా అంటే ఎడమవైపునుంచి కుడివైపుకు, కుడి వైపునుంచి ఎడమవైపుకు తిప్పండి. ఇలా చేస్తున్నప్పుడు మీ శ్వాసమీద దృష్టి పెట్టండి.

మీరు చేయవలసిన యోగాసనాలలో ముఖ్యంగా తాడాసనం, అర్ధ-మత్స్యేంద్రాసనం, నౌకాసనం, అలాగే విపరీత నౌకాసనం. ప్రాణాయామంలో నాడీ మండలంపై ప్రత్యేక దృష్టిని సారించండి. ఆ తర్వాత శవాసనంలో యోగ నిద్రలోకి జారుకోండి. దీర్ఘంగా శ్వాస పీల్చండి. వదలండి. ఇలా చేస్తుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో మీరు చలాకీగా ఉండగలరని యోగా నిపుణులు అంటున్నారు.
<< 1 | 2 
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అందంగా లేనా...!
చర్మ సౌందర్యానికి సూర్య నమస్కారం
ఎసిడిటీని తగ్గించే ఉత్థాన పాదాసనం
లింగ ముద్ర
యువతులకు అందాన్నిచ్చేది యోగా
శీర్షాసనం వేయండిలా..!