"రాత్రుళ్లు మా పిల్లలకు అస్సలు భయం అనేదే ఉండదు తెలుసా..? ఏ సమయంలోనయినా వాళ్లంతట వాళ్లే లేచి బాత్‌రూమ్‌కు వెళ్లి వస్తుంటార"నీ సంబరపడిపోయే తల్లిదండ్రులు కాస్త జాగ్రత్త పడాల్సిందే...! పిల్లలకు భయం లేకపోవటం సంతోషమే అయినా.. అలాంటి పిల్లలు పెద్దయ్యాక నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడిస్తోంది.