1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. కథనాలు

చంద్రుడు మనకి ఎంత దూరంలో ఉన్నాడో తెలుసా?

చంద్రుడు మనకి ఆకాశంలో కనిపించినట్టే చంద్రుడు
చంద్రుడు మనకి ఆకాశంలో కనిపించినట్టే చంద్రుడు నుంచి చూస్తే భూమి ఆకాశంలో పైనే కనిపిస్తుంది. ఎందుకంటే విశాల విశ్వంలో పైన, కిందన అనే బేధాలు ఉండవు కదా!

చంద్రుడు మనకి రాత్రుల్లో వెలుగును ఇస్తాడు... తెలుసు కదా - వెన్నెల రోజుల్లో అయితే మరింత వెలుతురిని అందించే ఆ చందమామకి మన భూమి కూడా రాత్రిళ్లు వెలుగునిస్తుంది తెలుసా?... చంద్రుని కంటె కూడా ఎంతో ఎక్కువగా సూర్యకాంతిని ప్రతిఫలించే భూమి చంద్రుడు భూమికి ఇచ్చే వెలుగు కంటె 90 రెట్లు ఎక్కువ వెలుగును చంద్రుడికిస్తుంది. అంటే చంద్రుని మీద కూర్చుని రాత్రిపూట ఎంత చిన్న అచ్చు పుస్తకాన్ని అయినా - చక్కగా చదువుకోగలం అన్నమాట.

ఇంకో విశేషం ఏమిటంటే మనకి చంద్రుడు ఓ రోజు ఓ చిన్న రేఖలా, మరో రోజు కాస్త పెద్దదిగా... ఇలా కనిపిస్తాడు కదా - అలాగే భూమి కూడా చంద్రుని మీద వుండే వారికి ఒకోరోజు ఒకో సైజులో కనిపిస్తుంది. మనకి అమావాస్య అంటే మనకి చంద్రుడు కనిపించని రోజున చంద్రలోకంలో పౌర్ణమి - అంటే భూమి పూర్తిగా కనిపిస్తుందన్న మాట.

అదే మనకి పౌర్ణమి అయినపుడు చంద్రుడు పెద్దగా కనిపించే రోజున అక్కడ అమావాస్యలా చీకటిగా ఉంటుంది. అయితే ఈ అందాల చంద్రుడు మనకి ఎంత దూరంలో ఉన్నాడో తెలుసా? సుమారు 2,38,355 మైళ్ళ కాంతి సంవత్సరాల లెక్కల్లో చెప్పాలంటే చంద్రుడు మనకి 1.28 కాంతి సెకండ్ల దూరంలో ఉన్నాడు.
About Writer
WD