1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. కథనాలు

నక్షత్రం ఎలా పుడుతుందో తెలుసా?

చిక్కని వాయు-ధూళి మేఘాలు గురుత్వాకర్షణశక్తి కారణంగా కుదించుకుపోయినందువల్ల నక్షత్రం జన్మిస్తుంది. మామూలుగా అయితే ఈ వాయు-ధూళి మేఘాల
చిక్కని వాయు-ధూళి మేఘాలు గురుత్వాకర్షణశక్తి కారణంగా కుదించుకుపోయినందువల్ల నక్షత్రం జన్మిస్తుంది. మామూలుగా అయితే ఈ వాయు-ధూళి మేఘాల ఉష్ణోగ్రత మైనస్‌ 270 సెంటిగ్రేడ్‌ డిగ్రీలు ఉంటుంది. ఆ మేఘాలు గుర్వుతాకర్షణ శక్తివల్ల కుదించుకుపోతూ వుంటాయి. ఇలా కుదించుకుపోవడంవల్ల వేడి పెరుగుతుంది. ఎంత ఎక్కువ కుదించుకుపోతే అంత ఎక్కువ వేడి పుడుతుంది. వరికి వాయు-ధూళి మేఘాల మధ్య భాగంలోని వేడిమి కొన్ని మిలియన్‌ల డిగ్రీల స్థాయికి చేరుకోగానే అక్కడ హైడ్రోజన్‌ అణువులు సంయోగం చెంది హీలియం ఏర్పడుతుంది.

ఈ కలయికవల్ల అపారమైన శక్తిపుడుతుంది. ఈ శక్తి కాంతిరూపంలో ఉండి, నక్షత్రం మధ్య భాగంనుంచి కాంతి కిరణాలు నక్షత్రం బయటికి దూసుకుపోతాయి. అదే నక్షత్రం పుట్టడం. వాయు-ధూళి మేఘం గురుత్వాకర్షణశక్తి, దాని మధ్య భాగంనుంచి వెలువడే కాంతిశక్తి సమానమవటంవలన వాయు-ధూళి మేఘం కుదింపు అక్కడితో ఆగిపోయి, అదే నక్షత్రంగా ఒక నిర్ధిష్ట రూపం దాల్చి ప్రవేశించటం మొదలు పెడుతుంది.

ఇలా ఏర్పడిన నక్షత్రాలలో సుమారు 10 వేల కోట్ల నక్షత్రాలు కలిపి ఒక గాలక్సీగా ఏర్పడతాయి. గాలక్సీలు కూడా దేనికది విడిగా వుండక రెండేసి, మూడేసి, నాలుగేసి, లేదా వంద, రెండు వందల చొప్పున గుత్తులుగా ఉంటాయి. అటువంటి కొన్ని వందల కోట్ల గాలక్సీల గుత్తులు కలిసి ఈ మహావిశ్వం ఏర్పడింది. సప్తఋషి మండలం అని ఎప్పుడైనా చూశారా, దాన్లో... కొన్ని నక్షత్రాల మధ్య ఎంతో ఖాళీ కనిపిస్తుంటుంది.... కాని పెద్ద టెలిస్కోపులలో నుంచి ఆ భాగాన్ని చూస్తే కోట్లకొలది నక్షత్రాలు కనిపిస్తాయి... అంతేకాదు ఇంకా పెద్ద టెలిస్కోపులలో నుంచి చూసిన శాస్త్రజ్ఞులు ఏమన్నారో తెలుసా... ఆ కొద్ది ప్రాంతంలో ఊహకు అందనంత దూరాలలో పదిహేను వందలకు పైగా గాలక్సీలు ఉన్నట్టు లెక్కవేశారు.
మనకి కనిపిస్తున్నవి పూర్తిగా నక్షత్రాలు కూడా కాదూ వాటి ఓ కాంతికిరణం... అంటే వెలుతురు ఎంత వేగంగా ప్రయాణిస్తుందో... దాన్నిబట్టి ఆ నక్షత్రం ఉన్న దూరాన్ని బట్టి... ఇప్పుడు మనకు కనిపిస్తున్న నక్షత్ర కిరణాన్ని అంచనా వేస్తారు. అంటే సుమారు ఓ నాలుగు వందల ఏళ్ళ క్రితం బయలుదేరిన ఓ నక్షత్ర కిరణం ఈరోజున మనకి కనిపించవచ్చు- అంటే ఈరోజు మనం చూస్తున్న ఓ నక్షత్రం ఎప్పటిదో అన్నమాట- కాలం, కాంతి వేగం, దూరం... ఇలా ఎన్నో విషయాల మధ్య ఇమిడి వుంది.

నక్షత్ర మండలం

సూర్య చంద్రుల లాగానే నక్షత్రాలు కూడా ఉదయిస్తాయి, అస్తమిస్తాయి - ఎప్పుడైనా రాత్రిపూట ఆకాశ్నాని జాగ్రత్తగా పరిశీలించి చూడండి. తూర్పు ఆకాశంలో వున్న తారలు క్రమంగా నడినెత్తికి వచ్చి పడమటకి వాలిపోతాయి. అయితే నిజానికి అవి తిరగటం లేదు. భూమి తనచుట్టూ తాను తిరగటం వల్ల నక్షత్రాలు తిరుగుతున్నట్టు కనిపిస్తాయి. అంతేకాని నక్షత్రానికి నక్షత్రానికి మధ్య దూరం మాత్రం మారదు... ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు గడిచినా ...

అలా అని పూర్తిగా నక్షత్రాలకు చలనం లేదనుకుంటున్నారా ... ఏంటి? ప్రతి నక్షత్రం తన కక్ష్యలో తాను ప్రయాణం చేస్తుంది. వాటి సగటు వేగం సెకనుకు 20 మైళ్ళు - అంటే దాదాపుగా భూమి ప్రయాణం చేస్తున్నంత వేగం. అదిగో వెంటనే మీరు ఇదేంటి కదులుతున్నాయంటున్నారు ... కదలవంటున్నారు అని గందరగోళంగా అనిపిస్తోందా ...... అవి అంత మహావేగంతో ప్రయాణం చేస్తున్నా ... కదలనట్టు ఎందుకు అనిపిస్తాయంటే ... అవి అపార దూరాలలో వుండటం వల్ల కదులుతున్నా కదలనట్టే వుంటాయి. కొన్ని వేల సంవత్సరాలు గడిస్తే వాటి సాన చలనం ఒక్కరవ్వ తెలుస్తుంది.

అయితే నక్షత్రాలలో కొన్ని చాలా తెల్లగా ... ప్రకాశవంతంగా కనిపిస్తే మరికొన్ని ... ఒక మాదిరిగా .. కొన్ని కనీకనిపించకుండా వుంటాయి... ఎప్పుడైనా గమనించారా ... ఆకాశంలో అన్నిటికంటె తెల్లగా ... మెరిసిపోయే తార పేరు సిరియస్‌ ... పిల్లలూ ఇక్కడ విషయం చెప్పాలి - నిజానికి ఓ తార ఎంతో కాంతి కలిగి వుండచ్చు - కాని అది మనకు తక్కువ వెలుతురుతో కనిపిస్తుంది. కారణం అది మనమే ఎంతో ... ఎంతో దూరంలో వుండటం -అలాగే తక్కువ కాంతి కలిగిన తారలు ఎంతో తెల్లగా మెరిసిపోతూ కనిపించవచ్చు. కారణం దగ్గరగా వుండటం వల్ల అలా కనిపిస్తాయన్న మాట. కాబట్టి దూరం బట్టి ... మిణుకు మిణుకుమనే నక్షత్రాల కాంతి ఆధారపడి ఉంటుందన్న మాట.
About Writer
WD