ప్రధాన పేజి   ఇతరాలు > బాలప్రపంచం > కథనాలు
 
నిశ్శబ్ద విప్లవానికి నిదర్శనం "విద్యాసాగర్"
WD PhotoWD
జీవితంలో అన్నీ కోల్పోయి, ఎవరో వచ్చి ఆదుకుంటారని ఎదురు చూసే మానసిక వికలాంగులైన బాలలు కనిపిస్తారనే ఆలోచనతో విద్యాసాగర్‌ను సందర్శించినట్లయితే మీరు సంభ్రమాశ్చర్యాలకు లోనుకాక తప్పదు. మానసిక వైకల్యంతో బాధపడే వారికి నేనున్నానంటూ ఊరటనిచ్చి వారి జీవితాల్లో వెలుగురేఖలు నింపేందుకు 1985వ సంవత్సరంలో చెన్నై నగరంలో స్పాస్టిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆవిర్భవించింది.

తన సంతానంతో పాటు మరో ఇద్దరు మానసిక వికలాంగులైన బాలలతో ఒక గ్యారేజీలో వ్యవస్థాపకురాలు పూనమ్ నటరాజన్ సంస్థను ప్రారంభించారు. అనంతర కాలంలో విద్యాసాగర్‌ పేరిట సంస్థ దేశవ్యాప్తంగా 39 శాఖలను కలిగి 1000 మందికిపైగా వాలంటీర్ల సేవాదృక్ఫధంతో యావత్ భారతదేశానికి వ్యాపించింది. ఆశ్రయం కోరివచ్చే వారికి జీవితం పట్ల ఆశావాద ధోరణిని అలవర్చడంలో తనదైన శైలిలో ముందుకు సాగుతున్న విద్యాసాగర్ సేవలకు గుర్తింపుగా 2005 సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం జాతీయ పురస్కారాన్ని ప్రధానం చేసారు.

అంతేకాక ఒకే గొడుగు కింద స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ, విద్య మరియు పునరావాసం కల్పించే కల్పతరువుగా విద్యాసాగర్ సామాజిక సేవారంగంలో వెలిగిపోతున్నది. విద్యాసాగర్‌లో మూడు సంవత్సరాల చిన్నారుల నుంచి 60 సంవత్సరాల వయస్సు కలిగిన వృద్ధుల దాకా దాదాపు 300 మంది మానసిక వైకల్యం కలవారు పునరావాసం పొందుతున్నారు.

మానసిక వైకల్యంతో పుట్టిన పిల్లలకు కొత్త జీవితాన్ని అందించటంతోపాటుగా పిల్లలతో ఎలా వ్యవహరించాలి అనే అంశంపై వారి తల్లిదండ్రులకు ప్రత్యేక శిక్షణను ఇవ్వడంలో విద్యాసాగర్ పలువురి ప్రశంసలను చూరగొంటున్నది. "మానవసేవ మాధవసేవ" అన్న నానుడిని నిజం చేస్తూ ముందుకు సాగుతున్న విద్యాసాగర్ చిరంజీవిలా వర్ధిల్లాలని ఆశిద్దాం.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని
నక్షత్రం ఎలా పుడుతుందో తెలుసా?
చంద్రుడు మనకి ఎంత దూరంలో ఉన్నాడో తెలుసా?
మంచి గాయనిగా పేరు తెచ్చుకోవాలి: మానస
కాలిఫోర్నియాలో తెలుగు సూపర్‌ కిడ్‌ నిషితా
తెలుగుపాటకు దొరికిన మరో ఉగాది కోకిలమ్మ రేవతి