ప్రధాన పేజి   ఇతరాలు > బాలప్రపంచం > కథనాలు
 
అండమాన్‌లో బాలల పార్లమెంట్
ఉత్తర అండమాన్ ద్వీపకల్పానికి చెందిన మాయాబుండెర్ ప్రాంతంలో గల ఆర్చెపిలాగోకు చెందిన బాలల కోసం ప్రత్యేక పార్లమెంట్ గత వారం తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా దక్షిణ, మధ్య అండమాన్ డిప్యూటీ కమీషనర్ స్వీయ పర్యవేక్షణలో వందల సంఖ్యలో బాలలు ప్రమాణ స్వీకారం చేసారు.

సామాజిక ప్రాముఖ్యత కలిగిన పలు అంశాల పట్ల ప్రజలకు అవగాహన కలిగించేందుకు బాలల పార్లమెంట్ ఎంతగానో ఉపకరిస్తుందని దక్షిణ, మధ్య అండమాన్ డిప్యూటీ కమీషనర్ వివేక్ పాండే మీడియాతో అన్నారు. పిల్లలు తమ హక్కులు, బాధ్యతలు తెలుసుకునేందుకు సహకరించడంతోపాటుగా సమాజంలోని దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడటంలో బాలపార్లమెంట్ వారికి వెన్నుదన్నుగా నిలుస్తుందని వివేక్ పాండే తెలిపారు.

బాలలపార్లమెంట్ ఏర్పాటును ఉత్తర అండమాన్ గ్రామాల పంచాయతీ సభ్యులు స్వాగతించారు.
మరిన్ని
'గోడలపై నాట్యం' చేసే చిత్రాలు
ఆరోగ్యవంతమైన హృదయం కోసం...
బాలల కరదీపిక 'మాయా పాత్ర'
వాళ్ళను అలా పిలవకండి, లోపం లేనిదెవరికి?
నిశ్శబ్ద విప్లవానికి నిదర్శనం "విద్యాసాగర్"
నక్షత్రం ఎలా పుడుతుందో తెలుసా?